ట్రాక్టర్, ఆటో ఢీ: ఇద్దరు మృతి | Tractor , auto collided : Two killed | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, ఆటో ఢీ: ఇద్దరు మృతి

Mar 17 2016 5:49 PM | Updated on Oct 20 2018 6:04 PM

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం రావిపాడు వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం రావిపాడు వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొండాపురం మండలం గరిమెనపెంట నుంచి ఐదుగురు ప్రయాణికులతో బయలుదేరిన ఆటోను రావిపాడు వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడి అందులో ఉన్న వారిలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఆటో డ్రైవర్ చంద్ర సహా తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement