నేడు విజయమ్మ రోడ్ షో | today Y. S. Vijayamma YSR Janabheri | Sakshi
Sakshi News home page

నేడు విజయమ్మ రోడ్ షో

Apr 20 2014 1:40 AM | Updated on May 29 2018 4:06 PM

నేడు విజయమ్మ రోడ్ షో - Sakshi

నేడు విజయమ్మ రోడ్ షో

వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి వైఎస్.విజయ మ్మ ఆదివారం గాజువాక, పశ్చిమ నియోజక వర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు.

  • గాజువాక, పశ్చిమ నియోజకవర్గాల్లో పర్యటన
  •  పెదవాల్తేరు, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి వైఎస్.విజయ మ్మ ఆదివారం గాజువాక, పశ్చిమ నియోజక వర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంట లకు గాజువాక నియోజక వ ర్గం షీలానగర్ నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. రోడ్‌షో వివరాలను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ శనివారం వెల్లడించారు.
     
    షీలానగర్ నుంచి అయ్యప్పస్వామి ఆలయం, నాతయ్యపాలెం, బీహెచ్‌పీవీ జంక్షన్, పాత గాజువాక, శ్రీనగర్ జంక్షన్, వడ్లపూడి, దువ్వాడ, అగ నంపూడి, ఫార్మాసిటీ ఏరియాల్లో రోడ్ షో నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు గాజువాక టీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్లో ట్రేడ్ యూనియన్ సమావేశానికి హాజరవుతారు.
     
    సాయంత్రం 4.30 గంటలకు పశ్చిమ నియోజక వర్గం జింక్ గేట్, ఆంజనేయస్వామి ఆలయం, ములగడ హౌసింగ్ కాలనీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీ, బర్మా కాలనీ, శ్రీదుర్గా ఆలయం రోడ్డు, ఇందిరా కాలనీ పార్కు రోడ్డు, జనతా కాలనీ, అంబేద్కర్ కాలనీ, గుడివాడ అప్పన్న కాలనీ, త్రినాథ్‌పురం, క్రాంతి నగర్, మల్కాపురం పోలీస్‌స్టేషన్ రోడ్డు, నౌసేనా బాగ్, కల్యాణి ఆస్పత్రి రోడ్డు, మల్కాపురం మెయిన్‌రోడ్డు, రామకృష్ణపురం రోడ్డు, శ్రీహరిపురం మెయిన్‌రోడ్డు, నక్కవానిపాలెం రోడ్డు, గాజువాక ఆర్టీసీ డిపో ప్రాంతాల్లో పర్యటిస్తారు. రాత్రి 7 గంటల నుంచి గాజువాక నియోజక వర్గం కొత్త గాజువాక జంక్షన్, దయాళ్‌నగర్ జంక్షన్, పెద గంట్యాడ టీఎన్‌ఆర్ స్కూల్ జంక్షన్, బాలచెరువు ఆర్క్ జంక్షన్, పెదగంట్యాడ ఏరియాల్లో విజయమ్మ రోడ్ షో ఉంటుంది.
     

Advertisement
 
Advertisement
Advertisement