నేడు, రేపు పంట నష్టంపై టీఆర్‌ఎస్ అధ్యయనం | Today, tomorrow Crop Loss of Telangana | Sakshi
Sakshi News home page

నేడు, రేపు పంట నష్టంపై టీఆర్‌ఎస్ అధ్యయనం

Oct 26 2013 3:08 AM | Updated on Sep 4 2018 5:07 PM

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై అంచనా వేసేందుకు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అధ్యయనం చేయాలని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది.

కరీంనగర్, న్యూస్‌లైన్ : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై అంచనా వేసేందుకు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అధ్యయనం చేయాలని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. పంట నష్టం వివారలను సేకరించి జిల్లాల్లో వ్యవసాయశాఖ అధికారికి, కలెక్టర్‌కు, రాష్ర్ట పార్టీకి అధ్యయన బృందం నివేదిక సమర్పిస్తుంది.
 
 రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో పంట నష్టం అంచనా నివేదికలను వ్యవసాయశాఖ కమిషనర్‌కు సమర్పించడంతోపాటు రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ కృషిచేస్తుంది. శనివారం సిరిసిల్ల, వేములవాడతోపాటు మరో రెండు నియోజకవర్గాలు, ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో బృందం పర్యటిస్తుంది. ఈ బృందంలో టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, నల్లాల ఓదెలు, గడ్డం అరవిందరెడ్డి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement