ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu news Sep 29th TRS Aks CPI Support In Huzurnagar Bye Elections | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Sep 29 2019 8:03 PM | Updated on Sep 29 2019 8:40 PM

Today Telugu news Sep 29th TRS Aks CPI Support In Huzurnagar Bye Elections - Sakshi

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే  రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో  గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  నియామక పత్రాలు అందజేయనున్నారు. దసరా పండగ ముందు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు భారీ షాక్‌ ఇచ్చారు. అక్టోబర్‌ 5 నుంచి సమ్మె చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు జియాంగ్సూ ప్రావిన్సులో బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 36 మంది చనిపోయారు. మరో 40మంది తీవ్ర గాయాలపాలైనట్లు ఈజింగ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement