ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Jan22nd Telangana Municipal Elections finished | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Jan 22 2020 7:20 PM | Updated on Jan 22 2020 7:54 PM

Today Telugu News Jan22nd Telangana Municipal Elections finished - Sakshi

అసెంబ్లీలో టీడీపీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభలో వీధిరౌడీలు మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పాలనా వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గత ప్రభుత్వ హయంలో రాజధాని పేరుతో టీడీపీ నేతలు భూములు కొట్టేశారని ఆరోపించారు. ఇక, తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 120 మున్సిపాలిటీలకు 9 కార్పొరేషన్లకు ఎన్నికలు ముగిశాయి. ఇదిలా ఉండగా, అన్ని మతాలూ సమానమని భారతీయ విలువలు ప్రభోదిస్తాయని, అందుకే భారత్‌ లౌకిక దేశంలా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. భారత్‌ ఎన్నడూ పాకిస్తాన్‌ వంటి మత రాజ్యం కాబోదని స్పష్టం చేశారు. ఇకపోతే, చంద్రయాన్‌ 3 మిషన్‌కు శ్రీకారం చుట్టామని, పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఇస్రో చీఫ్‌ కే శివన్‌ బుధవారం వెల్లడించారు. బుధవారం చోటుచేసుకున్న మరిన్ని సంఘటనల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement