
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ సమావేశం జరిగింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై సీఎం జగన్‌తో ముకేష్ చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చార్మినార్ వద్ద శనివారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో ప్లాగ్‌మార్చ్‌ను నిర్వహించింది. పాకిస్తాన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సింద్ ప్రావిన్స్‌లో రైలు, బస్సు ఢీకొట్ట ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. సుక్కూర్ నగరంలోని రోహ్రి ప్రాంతంలో రైల్వే గేటు వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. శనివారం చోటు చేసుకున్న మరిన్ని విశేషాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.