ఈనాటి ముఖ్యాంశాలు

Today Telugu News Dec30 Bomb blast in Adilabad - Sakshi

ఉగాది రోజు పేదలకు ఇళ్లపట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. మరోవైపు అడవుల పెంపకంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందని కేంద్ర అటవీ పర్యవరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అన్నారు. ఇదిలా ఉండగా, సామాన్యులకు సకాలంలో ఇసుకను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇకపోతే, ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన నెల అనంతరం మహారాష్ట్రలో పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం నెలకొంది. మరోమైపు అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు క్రాస్ రోడ్ వద్ద భారీ పేలుడు సంభవించింది. బైక్‌పై తీసుకువెళుతున్న పేలుడు పదార్థాలు పేలడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top