ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Dec 4th JC Diwakar reddy surrendered in Police Station | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Jan 4 2020 7:27 PM | Updated on Jan 4 2020 8:15 PM

Today Telugu News Dec 4th JC Diwakar reddy surrendered in Police Station - Sakshi

మున్సిపల్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు రాష్ట్రంలో పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తైంది. రిజర్వేషన్ల వివరాలను శనివారం తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పంపించింది. ఇక, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి శనివారం అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. ఇదిలా ఉండగా, గ్రీన్‌ఫీల్డ్‌ క్యాపిటల్‌ సాధ్యంకాదన్న శివరామకృష్ణ కమిటీ సూచనలను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఇకపోతే, మూడు రాజధానుల ప్రకటనను జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ మరోసారి సమర్థించారు. శనివారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement