
విశాఖపట్నంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా ఏపీ శాసనమండలి రద్దుపై కేంద్రం సానుకూలంగానే స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మండలి రద్దుకు ప్రభుత్వం చట్ట ప్రకారం తీర్మానం చేసిందని తెలిపారు. మరోవైపు నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. బుధవారం చోటుచేసుకున్న ఇలాంంటి మరిన్ని వార్తలకోసం ఈ వీడియో క్లిక్ చేయండి.