ఏయూ దూరవిద్య నేటి పరీక్ష వాయిదా | today au distance education exams postponed | Sakshi
Sakshi News home page

ఏయూ దూరవిద్య నేటి పరీక్ష వాయిదా

May 30 2014 1:32 AM | Updated on Sep 26 2018 3:25 PM

ఏయూ దూరవిద్యా కేంద్రం శుక్రవారం నిర్వహించాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ పరీక్షలు వాయిదా వేసినట్టు కేంద్రం సంచాలకుడు ఆచార్య ఎల్‌డీ సుధాకర్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), న్యూస్‌లైన్ : ఏయూ దూరవిద్యా కేంద్రం శుక్రవారం నిర్వహించాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ పరీక్షలు వాయిదా వేసినట్టు కేంద్రం సంచాలకుడు ఆచార్య ఎల్‌డీ సుధాకర్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగే మొదటి సంవత్సరం, మధ్యాహ్నం జరిగే మూడో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్టు పేర్కొన్నారు.

ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష కారణంగా ఈ పరీక్షను వాయిదా వేసినట్టు ఆయన వివరించారు. ఈ పరీక్షను జూన్ ఒకటో తేదీ ఆదివారం నిర్వహిస్తామన్నారు. ఆ రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మిగిలిన పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.
 
పరీక్ష కేంద్రం మార్పు
బీఎస్సీ విభాగంలో కాకినాడ పి.ఆర్.ప్రభుత్వ కళాశాలను ఎంపిక చేసుకున్నవారు ఎంఎస్‌ఎన్ కళాశాలో పరీక్షలకు హాజరుకావలసి ఉంటుంది. విద్యార్థులు మారిన పరీక్షా కేంద్రాల నుంచి తమ హాల్ టికెట్లు పొంది పరీక్షకు హాజరుకావాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement