ఎక్సైజ్ సుంకం ఎత్తేసే వరకు ఆందోళన | to excise duty concern pay tax | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ సుంకం ఎత్తేసే వరకు ఆందోళన

Mar 11 2016 3:28 AM | Updated on Aug 20 2018 9:26 PM

ఎక్సైజ్ సుంకం ఎత్తేసే వరకు ఆందోళన - Sakshi

ఎక్సైజ్ సుంకం ఎత్తేసే వరకు ఆందోళన

బంగారు అభరణాలపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేసే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని ....

జ్యువెలరీ వ్యాపారుల హెచ్చరిక
జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన బంగారం క్రయ,విక్రయాలు
న గరంలో బైక్ ర్యాలీ.. ధర్నా

 
కర్నూలు(అగ్రికల్చర్): బంగారు అభరణాలపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేసే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని జ్యువెలరీ వ్యాపారులు  కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ డిమాండ్‌తో వారు గురువారం షరాప్ బజారులో దుకాణాలు మూసేసి నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద  ధర్నా చేపట్టారు.ఈ సందర్బంగా జ్యువెలరీ మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుణ్యమూర్తి రామయ్య మాట్లాడుతూ...ఇంతవరకు బంగారంపై ఎలాంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లేదని అయితే తాజాగా కేంద్రం బడ్జెట్‌లో ఒక్క శాతం విధించడం  తగదని తెలిపారు. ఎక్సైజ్ సుంకం విధించడంతో బంగారం వ్యాపారులపై వత్తిళ్లు పెరుగుతాయని,  అలాగేఅధికారులు వేధింపులు అధికమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే బంగారం ధరలు పెరగడంతో కొనుగోలు తగ్గిపోయిందని, ఎక్సైజ్ సుంకం విధిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. 

రూ 2 లక్షల బంగారం కొనుగోలుపై వినియోగదారులు పాన్ కార్డు చూపాలనే నిబంధన పెట్టడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.  అప్పటి వరకు  షాపులు మూసివేస్తామని ప్రకటించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఆయన స్పందిస్తూ మీ ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకపోతామని తెలిపారు.   కార్యక్రంలో  అసోసియోషన్ నేతలు  సోమకృష్ణ, వెంకటరమణ, రమణకుమార్, శ్రీనివాస్‌ప్రసాద్, నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement