రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం | three died in ananthapur district car accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

Apr 25 2016 9:56 AM | Updated on Aug 14 2018 3:22 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం - Sakshi

రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

అనంతపురం జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

శింగనమల: అనంతపురం జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శింగనమల మండలం లోలూరు క్రాస్ రోడ్డు వద్ద బెంగళూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే అనంతపురం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఇద్దరు చనిపోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement