గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌ | three cannabis smugglers arrested in vijayawada | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

Mar 30 2017 8:15 PM | Updated on Sep 5 2017 7:30 AM

గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను గురువారం జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

విజయవాడ రైల్వేస్టేషన్: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను గురువారం జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం ప్లాట్‌ఫాం  నెంబరు 1, 9 పై అనుమాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారి బ్యాగులను  జీఆర్పీ పోలీసులు తనిఖీ చేశారు. అందులో గంజాయి ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయిని చెన్నైకి తరలిస్తున్నట్లు నిందితులు సెలైదొరై (42), మురుగన్‌(45), పెరుమాళ్‌లు(42) వెల్లడించారని జిఆర్పీ పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రైల్వే కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement