మద్యం అమ్ముతున్న ముగ్గురి అరెస్టు | Three arrested for selling alcohol | Sakshi
Sakshi News home page

మద్యం అమ్ముతున్న ముగ్గురి అరెస్టు

Dec 10 2015 7:30 PM | Updated on Sep 5 2018 8:43 PM

మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుంటూరు జిల్లా రేపల్లె ఎక్సైజ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.

మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుంటూరు జిల్లా రేపల్లె ఎక్సైజ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని మైనేనివారి పాలెం గ్రామానికి చెందిన రాయని సాంబయ్య, ఉయ్యూరు పాపారావుతోపాటు చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన అద్దంకి శివనాగేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement