గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో శుక్రవారం ఆర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు.
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో శుక్రవారం ఆర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. సీతానగరం చిన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో వీరభద్రరావు అనే వ్యక్తి ఇంట్లోకి శనివారం తెల్లవారుజామున దొంగలు చొరబడి ఇంట్లోని వారిపై దాడి చేసి బంగారు నగలను దోచుకుపోయారు.
బాధితుల కథనం మేరకు... వీరభద్రరావు, ఆయన కుమార్తె ఇంట్లో నిద్రపోతుండగా తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తట్టారు. వీరభద్రరావు తలుపు తీయగా ఇద్దరు దుండగులు ముఖంపై దాడి చేసి గాయపరిచారు. లోపలికి ప్రవేశించి ఆయన కుమార్తెను కట్టేసి మెడలోని బంగారు గొలుసులు, చెవి దిద్దులు దోచుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది.