ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు | The right to a special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

Apr 30 2015 9:19 PM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి సాకె శైలజానాధ్ విమర్శించారు.

తిరుచానూరు(చిత్తూరు): ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి సాకె శైలజానాధ్ విమర్శించారు. చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని దామినేడు ఇందిరమ్మ గృహ సముదాయం వద్ద గురువారం సాయంత్రం సామూహిక దీక్ష వాల్‌పోస్టర్లను మాజీ మంత్రితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు బీజేపీ నాయకులు విభజన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మారుస్తున్నారని ఆరోపించారు.


ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వెంటనే అమలుచేయాలని, పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమలుచేయాలని, ఏపీ పునర్విభన చట్టాల్లోని అన్ని అంశాలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2వ తేదీ శనివారం గుంటూరులో సామూహిక దీక్షను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు రాష్ట్ర ప్రజలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement