పంటల బీమా ప్రీమియం గడువు పెంపు | The growth of the crop insurance premium due | Sakshi
Sakshi News home page

పంటల బీమా ప్రీమియం గడువు పెంపు

Jan 4 2015 2:14 AM | Updated on Aug 11 2018 8:58 PM

రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం గడువును 2014 డిసెంబర్ 31 నుంచి 2015 జనవరి 15వ తేదీ వరకు పొడిగించిందని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్...

జేడీఏ సుబ్బారావు

 నెల్లూరు(అగ్రికల్చర్): రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం గడువును 2014 డిసెంబర్ 31 నుంచి 2015 జనవరి 15వ తేదీ వరకు పొడిగించిందని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ కేవీ సుబ్బారావు(8886614211) తెలిపారు. మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం వివరాలను శనివారం ఆయన ‘సాక్షి’కి తెలిపారు. రబీలో పంటలను సాగు చేస్తున్న రైతులు బీమా ప్రీమియాన్ని సకాలంలో చెల్లించాలన్నారు.

ఆయా బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతుల వద్ద నుంచి బ్యాంక్ అధికారులే నేరుగా ప్రీమియం కట్టించుకుంటున్నందున వీరు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంక్ రుణం తీసుకోని రైతులు వరి పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు పేర్కోన్నారు. ఆసక్తి గల రైతులు అఐఇ ైఊ ఐూఈఐఅ, అగీఐ, ఏడఛ్ఛీట్చఛ్చఛీ, అఛిఛిౌఠ్ట ూౌ. 008010200023922  బ్యాంక్ పేర డీ.డీలను తీసి ఆయా మండల వ్యవసాయ అధికారి ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. యునెటైడ్ ఇండియన్ ఇన్సూరెన్సు కంపెనీ, నెల్లూరు శాఖ పేర కూడా డీ.డీలను తీసుకోవచ్చని తెలిపారు.
 
కాంట్రాక్టు ప్రాతిపదికన 120 ఎంపీఈఓ పోస్టుల భర్తీ
వ్యవసాయ శాఖలో బహుళ ప్రయోజక విస్తరణాధికారుల (ఎంపీఈఓ) పోస్టులను నెలకు రూ.8వేల గౌరవ వేతనంపై తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలను చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కేవీ.సుబ్బారావు తెలిపారు. స్థానిక వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లననుసరించి పోస్టులను భర్తీ చేస్తామన్నారు.

అభ్యర్థుల వయసు 2015 జులై ఒకటో తేదీ నాటికి 40 సంవత్సరాలు మించరాదన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల విద్యార్హతలకు మూడు కేటగిరిలలో గుర్తింపు ఇవ్వనున్నట్లు చెప్పారు. బీఎస్సీ(అగ్రి, ఉద్యానవనం, మెట్ట వ్యవసాయం) వారికి కేటగిరి- 1గా, వ్యవసాయంలో పాలిటెక్నిక్ డిప్లొమా, డిప్లొమా సీడ్ టెక్నాలజీ, సస్యరక్షణ, సేంద్రియ సాగు గుర్తింపు కలిగిన కోర్సులను కేటగిరి-2గా, వృక్షశాస్త్రంలో పట్టభద్రులు, బీఎస్సీ(బీజెడ్‌సీ) కోర్సు పూర్తి చేసిన వారిని కేటగిరి-3గా గుర్తిస్తామన్నారు.

80 శాతం మార్కులు వారి విద్యార్హత సాధించిన మార్కులు నుంచి, 20 శాతం మార్కులు మౌఖిక పరీక్షల ఆధారంగా నియామకాలు ఉంటాయన్నారు. స్థానిక అభ్యర్థులకు 80 శాతం, స్థానికేతరులకు 20 శాతం పోస్టులు కేటాయించినట్లు చెప్పారు. అర్హతకలిగినవారు అభ్యర్థి పేరు, తండ్రిపేరు, పుట్టిన తేదీ, కులం, వికలాంగుల కేటగిరి, విద్యార్హత ఉత్తీర్ణత శాతం మార్కులు, స్వస్థలం, నాలుగు నుంచి పదో తరగతి వరకు చదివిన వివరాలు, ప్రస్తుత చిరునామా, శాశ్వత చిరునామా వివరాలను దరఖాస్తులో పూరించాలన్నారు.

గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన ఎస్‌ఎస్‌సీ, విద్యార్హత, కులం, స్టడీ సర్టిఫికెట్ల జెరాక్సు కాపీలను దరఖాస్తు ఫారంతో జత చేయాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ లోపు నెల్లూరు మినీబైపాస్ రోడ్డులోని తమ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.

 పోస్టుల వివరాలు:
 మొత్తం 120 పోస్టులు ఉన్నాయి. ఓసీ జనరల్-40, మహిళలు-18, ఎక్స్ సర్వీస్ మెన్‌లో జనరల్-1, ఉమెన్-2, వికలాంగులకు-4, ఎస్సీ జనరల్- 12, మహిళలు-6, ఎస్టీ జనరల్- 4, మహిళలు- 3, బీసీ ఏలో జనరల్-6, మహిళలు-3, బీసీ బీలో జనరల్-6, మహిళలు-5, బీసీ సీలో మహిళలు-2, బీసీ డీలో జనరల్-5, మహిళలు-3 పోస్టులుగా నిర్ణయించారు.
 
 రబీ 2014-15 రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం
 పంటలు        బీమా చేయు మొత్తం        {పీమియం        రైతులు చెల్లించాల్సిన
                          (ఎకరాకు)                    శాతం               {పీమియం
 1.వరి        రూ.25,481.00            2.00             రూ.510.00

Advertisement
 
Advertisement
Advertisement