భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదే | the future of ysrcp party but cm chandrababu government failure | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదే

Mar 24 2016 4:32 AM | Updated on Jul 25 2018 4:07 PM

భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదే - Sakshi

భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదే

భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదేనని, నాయకులు, కార్యకర్తలు వలసలు రావడం తథ్యమని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ....


వెంకటగిరి: భవిష్యత్తు  వైఎస్సార్‌సీపీదేనని,  నాయకులు, కార్యకర్తలు వలసలు రావడం తథ్యమని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం గూడూరు డివిజన్ అధ్యక్షుడు మేరువ సురేంద్ర పేర్కొన్నారు.  బుధవారం నెల్లూరులో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు ఆయన సారథ్యంలో పలువురు కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ  నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి దిశానిర్దేశంలో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. కాగా పార్టీ సీనియర్ నాయకుడు నెమళ్లపూడి సురేష్‌రెడ్డి పార్టీలో చేరేందుకు వెళ్లే నాయకులను కలిసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ కందాటి కళ్యాణి, మాజీ ఎంపీపీ తాండవ రాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ మాజీ సభ్యుడు కూనా  మల్లికార్జున్, నాయకులు యస్ధానీబాషా, వీ మోహన్, సీహెచ్ హనుమంతరావు, అర్జునగారి మురళి, పోలీస్‌రామచంద్రయ్య, రామచంద్రయ్యయాదవ్, గురవయ్య, అన్నిమేటి వెంకటేశ్వర్లు, మేకల శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, సత్యారెడ్డి, మహిళావిభాగం నాయకురాలు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

 నెల్లూరు తరలి వెళ్లిన నేతలు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు వెంకటగిరి నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు భారీగా తరలివెళ్లారు. తరలివెళ్లిన వారిలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మండల కన్వీనర్ ఆవుల గిరియాదవ్, సీనియర్‌నాయకుడు జీ ఢిల్లీబాబు, నక్కా వెంకటేశ్వరరావు, తదితరులు  ఉన్నారు.

 డక్కిలి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. పార్టీ మండల కన్వీనర్ రంగినేని రాజా ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement