పార్వతీపురంలో బంగారు దుకాణాల మూసివేత | The closure of gold shops in PARVATHIPURAM | Sakshi
Sakshi News home page

పార్వతీపురంలో బంగారు దుకాణాల మూసివేత

Mar 2 2016 3:54 PM | Updated on Sep 3 2017 6:51 PM

కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై విధించిన ఒక శాతం ఎక్సైజ్ పన్నునుకు వ్యతిరేకంగా.. పార్వతీపురంలో బుధవారం దుకాణాలు మూసివేశారు.

కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై విధించిన ఒక శాతం ఎక్సైజ్ పన్నును రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో బుధవారం దుకాణాలు మూసివేశారు. మెయిన్‌రోడ్‌లో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓ రామకృష్ణకు వినతిపత్రం అందించారు. మూడు రోజుల్లోగా తమ డిమాండ్‌కు స్పందించకపోతే బంగారు దుకాణాల నిరవధిక బంద్ చేస్తామని బంగారు వర్తక సంఘం ప్రకటించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement