వాలేటివారిపాలెంలో దారుణం | The brutal murder in Prakasam district | Sakshi
Sakshi News home page

వాలేటివారిపాలెంలో దారుణం

Sep 30 2015 3:02 PM | Updated on Sep 3 2017 10:15 AM

వాలేటివారిపాలెంలో దారుణం

వాలేటివారిపాలెంలో దారుణం

వాలేటివారిపాలెం మండలం పోకూరి గ్రామంలో బుధవారం ఓ సైకో నాలుగేళ్ల బాలుడి గొంతు కోశాడు.

వాలేటివారిపాలెం మండలం పోకూరి గ్రామంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ సైకో నాలుగేళ్ల బాలుడి గొంతు  కోశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మహేంద్ర, ఆదిలక్ష్మిల రెండో కుమారుడు మను సాగర్(4) ఇంటి దగ్గర ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి వెతకడం ప్రారంభించారు.

తిరుమలరావు(35) అనే వ్యక్తి మనుసాగర్ ను  తీసుకెళ్లాడని స్థానికులు చెప్పడంతో.. అతడి ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసుకుని బయటికి వెళ్లబోయిన తిరుమల రావును తల్లిదండ్రులు ప్రశ్నించగా.. ఇంట్లో ఉన్నాడు చూసుకోండని సమాధానమిచ్చాడు. తలుపులు తెరిచి చూడగా.. బాలుడి తల వేరుచేసి ఉంది. ఇది చూసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు.

దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు తిరుమల రావు ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తిరుమలరావును కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement