తుందుర్రులో ఉద్రిక్తత

Tension In Tundurru at Aqua Food Park  - Sakshi

సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌ పైప్‌లైన్‌ నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సీపీఎం నేతలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు.

దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే సీపీఎం నేతలను అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆ పార్టీ కార్యకర్తలు, పార్క్‌ బాధితులు నిరసన తెలుపుతున్నారు.  ఆక్వాఫుడ్‌ పార్క్‌ వద్దంటూ 33 గ్రామాల ప్రజలు పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top