గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది.
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ల మధ్యనే మద్యం షాపు ఏర్పాటును ఆగ్రహించిన పట్టణ మహిళలు ఆ షాపు పై దాడి చేశారు. స్తానిక రజక చెరువు సమీపంలో ఏర్పాటువుతున్న దుకాణంలోని సిబ్బందిపై కారం చల్లి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై చేరి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.