తెలంగాణను అడ్డుకున్నది ముఖ్యమంత్రే | Telangana prevented kirankumar Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణను అడ్డుకున్నది ముఖ్యమంత్రే

Sep 16 2013 4:27 AM | Updated on Jul 29 2019 5:28 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటుంది సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు.

దేవునిపల్లి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటుంది సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అని  తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఆయన పట్టణంలోని టీడీపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన నాయకులు చరిత్రలో మిగలరన్నారు. అదే గతి కిరణ్‌కుమార్‌రెడ్డికి పడుతుందని ఆయన హెచ్చరించారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమాన్ని  కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారని అన్నారు. కాని కేంద్రం వారిపై ఎందుకు  చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ఇస్తారో లేదో ఆని అనుమానంగా ఉందన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు నూకలు చెల్లడం ఖాయమన్నారు.  సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement