సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ | teacher recruitment process to start on september 5th | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్

Aug 5 2014 1:13 PM | Updated on May 25 2018 5:44 PM

సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ - Sakshi

సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీ నోటిఫికేషన్ సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీ నోటిఫికేషన్ సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 10,603 పోస్టులను ఈసారి భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

ఇందులో స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు 1849, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 7,594, పండిట్ ఉపాధ్యాయ పోస్టులు 975, పీఈటీ పోస్టులు 185 ఉంటాయని ఆయన వివరించారు. ఇక టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) రద్దుపై తాము న్యాయసలహా తీసుకుంటామని గంటా అన్నారు. డీఈడీ విద్యార్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించే అవకాశం కల్పించడం మీద ఇంతవరకు ఎలాంటి ఆలోచన చేయలేదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement