‘పేట’లో టీడీపీకి కోలుకోలేని దెబ్బ | Sakshi
Sakshi News home page

‘పేట’లో టీడీపీకి కోలుకోలేని దెబ్బ

Published Fri, Apr 5 2019 4:29 PM

TDP Tough With YSRCP In The Sullurupeta - Sakshi

నాయుడుపేటటౌన్‌:  సూళ్లూరుపేట నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించే టీడీపీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి రాజారెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి గురువారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నెల్లూరులో కామిరెడ్డితోపాటు టీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అధినేత తంబిరెడ్డి మోహన్‌రెడ్డికి జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువాలను కప్పి స్వాగతించారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితోపాటు దువ్వూరు బాలచంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయశేఖర్‌రెడి, కట్టా వెంకటరమణారెడ్డి, మండల కన్వీనర్‌ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, పట్టణాధ్యక్షుడు 786 రఫీ, తదితర నాయకుల చొరవతో కామిరెడ్డి రాజారెడ్డితోపాటు పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చి వైఎస్సార్‌సీపీలో చేరారు. కొంతమంది నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు.

కామిరెడ్డి రాజారెడ్డితోపాటు పార్టీలో చేరిన ముఖ్యులు నాయుడుపేట జెడ్పీటీసీ మాజీ  సభ్యురాలు భారతమ్మ, టీడీపీ జిల్లా కార్యదర్శి చదలవాడ కుమార్, అన్నమేడు సహకార సంఘ చైర్మన్‌ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ గుంటూరు లక్ష్మయ్య, అన్నమేడు సహకార సంఘ మాజీ చైర్మన్‌ నెల్లూరు సాయికుమార్‌రెడ్డి, తంబిరెడ్డి సురేష్‌రెడ్డి, జలదంకి వెంకటకృష్ణారెడ్డిలు అనుచరులతో వైఎస్సార్‌సీపీలో చేరినట్లు ప్రకటించారు. కామిరెడ్డి రాజారెడ్డి నాయుడుపేట టీడీపీ మండల అధ్యక్షులుగా మండల ప్రజలతోనే కాకుండా నియోజకవర్గంలోని పలు మండలాల వారితో సత్సంబంధాలు కలిగి, మంచి పట్టున్న నాయకుడు. ఈయన వైఎస్సార్‌ సీపీలో చేరడంతో టీడీపీకి నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

సూళ్లూరుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పరసారత్నయ్య వైఖరి నచ్చకపోవడమే కాకుండా గ్రూపు రాజకీయాలు చేస్తుండడంతో పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు రాజారెడ్డి ప్రకటించారు. సూళ్లూరుపేట వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్ధి కిలివేటి సంజీవయ్యతోపాటు ఎంపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావు గెలుపునకు తన వంతు కృషి చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు దేవారెడ్డి విజయలురెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement