టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరెస్ట్‌ | TDP MPTC Candidate Held in Gambling Case Anantapur | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరెస్ట్‌

Jun 1 2020 12:02 PM | Updated on Jun 1 2020 12:02 PM

TDP MPTC Candidate Held in Gambling Case Anantapur - Sakshi

పేకాట ఆడుతూ పట్టుబడిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఎల్‌.రామాంజనేయులు (ఫైల్‌)

పరిగి: టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పరిగి ఎస్‌ఐ శ్రీనివాసులు నేతృత్వంలో ఆదివారం మండల వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించి, ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేశారు. కొడిగెనహళ్లి శివారులోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కొడిగెనహళ్లికి చెందిన రామాంజినేయులు, జయరాం, బాబాఫకృద్దీన్‌లను అరెస్టు చేసి, వారి వద్ద రూ.1450 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో టీడీపీ ఎంపీటీసీ–1 అభ్యర్థి ఎల్‌.రామాంజినేయులు ఉన్నారు.

శాసనకోటలో మరో ఐదుగురు అరెస్ట్‌
శాసనకోట గ్రామ శివారులోని పేకాట స్థావరంపై దాడులు నిర్వహించామని ఎస్‌ఐ తెలిపారు. కృష్ణమూర్తి, నరసింహప్ప, సంజీవప్ప, నరసింహప్ప, నారాయణప్ప అనే ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి, వారి వద్ద రూ.1370 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement