కోడ్ అమలులో ఉన్నా, సైకిళ్లు పంచి పెడుతూ..

TDP leaders violets Election code in Andhrapradesh - Sakshi

సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన జరుగుతోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇంకా మొద్దు నిద్ర వీడడం లేదనే విమర్శలొస్తు న్నాయి. నెల్లూరు మూలాపేటలో స్కూల్ విద్యార్థులకు సైకిల్ పంచేందుకు తీసుకువెళ్తున్న వాహనాన్ని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పలు పాఠశాలల్లో సైకిళ్లు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిసినా అధికారుల పట్టించుకోవడం లేదు. 

సైకిళ్ల పంపిణీ ఎక్కడికక్కడ నిలిపివేశామని డీఈవో అబ్రహం చెబుతున్నా సైకిళ్ల తరలింపు ప్రక్రియ ఆగడం లేదు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. పెదకాకాని మండలం వెనిగండ్లలో పంచాయతీ కార్యాలయంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపును బయట పెట్టుకోవాలని తహశీల్దారు, ఎస్.ఐ ఆదేశించినా, టీడీపీ నేతలు వారితో వాదనకు దిగారు.

మరిన్ని కథనాలు : 

ఎన్నికల కోడ్‌ ఉల్లం‘ఘనులు’

యథేచ్ఛగా టీడీపీ కోడ్‌ ఉల్లంఘన

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top