జీతాలు ఎగ్గొట్టిన టీడీపీ

TDP Has Left Asha workers Without Salary In Visakhapatnam In Their Government - Sakshi

పెదవాల్తేరు(విశాఖపట్నం) : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్లు కోరారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఆశా వర్కర్ల యూనియన్‌(సిటు అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం రేసపువానిపాలెంలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పారితోషికాలు కూడా చెల్లించకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషిం చుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే తమ వేతనాలను రూ.10వేలకు పెంచడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆశా వర్కర్లకు పనిభారం తగ్గిం చాలని కోరారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగిగా నమోదు చేయడంతో వారి పిల్లలు ఉపకార వేతనాలు, సామాజిక పింఛ న్లు, తదితర ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని వాపోయారు.

ఆశా వర్కర్లకు జాబ్‌ఛార్టు ఇవ్వాలని, పీహెచ్‌సీలకు పిలిచిన సందర్భాలలో టీఏ, డీఏలు చెల్లించాలని కోరారు. ఈ ధర్నాలో యూనియన్‌ అధ్యక్షురాలు వి.సత్యవతి, ప్రధాన కార్యదర్శి వి.మేరీ, జిల్లా అధ్యక్షురాలు పి.మణి, గౌరవాధ్యక్షురాలు బి.రామలక్ష్మి, సిటు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ ఎస్‌.అరుణ, ఐద్వా ప్రతినిధి కె.ద్రాక్షాయణి, సిటు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు కుమార్, జిల్లా నలుమూలల నుంచి 600 మంది వరకు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో ఎస్‌.తిరుపతిరావుకు వినతిపత్రం అందజేశా రు. దీనిపై స్పందించిన ఆయన పెండింగ్‌ వేతనా లను త్వరలోనే చెల్లించడానికి చర్యలు తీసుకుం టున్నామన్నారు. ధర్నా సందర్భంగా ద్వారకా, ఎంవీపీ పోలీస్‌ స్టేషన్ల సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top