నిర్లక్ష్యం నీడన.. ఐదేళ్ల పాలన | TDP Government Had Left The Farmers In Prakasam | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం నీడన.. ఐదేళ్ల పాలన

Apr 4 2019 8:35 AM | Updated on Apr 4 2019 8:35 AM

TDP Government Had Left The Farmers In Prakasam - Sakshi

కాలువ మధ్యలో బ్రిడ్జిలు కట్టాల్సిన చోట నిలిచిపోయిన కాలువ పనులు

సాక్షి, కందుకూరు రూరల్‌ (ప్రకాశం): రైతులకు పెద్దపీట వేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకున్న పాపాన పోలేదు. పొరపాటున వర్షాలు కురిస్తే చెరువులకు పుష్కలంగా నీరు చేరేందుకు అవకాశం ఉన్న సప్లయ్‌ ఛానల్‌ పెండింగ్‌ పనుల గురించి అసలు పట్టించుకోలేదు. కానీ చెరువులో పూడిక తీత తీసేందుకు మాత్రం నీరు చెట్టు పథకం తీసుకొచ్చారు. నామినేటెడ్‌ కింద కట్టపెట్టిన ఈ పనులు టీడీపీ కార్యకర్తలు పండగ చేసుకున్నారు. మోపాడు చెరువుకు పూడికతీత పేరుతో లక్షల రూపాయిలు మంజూరు చేసి కార్యకర్తలకు కట్టపెట్టారు. కానీ వర్షాలు పడితే సప్లయ్‌ ఛానల్‌ ద్వారా పనుల్లో అభివృద్ధి మాట ఎక్కడ వినిపించ లేదు. దీనిన బట్టి చూస్తే అర్థమవుతుంది రైతులపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో..

మహీధర్‌రెడ్డి హయంలో చకచక పనులు..
లింగసముద్రం మండలంలో వీఆర్‌కోట వద్ద మన్నేరుపై మోపాడు చెరువుకు కాలువు ఏర్పాటు 2011లో రూ.8.12 కోట్లు నిధులు మంజూరు చేశారు. 20.6 కిలో మీటర్లు మేర కాలువు నిర్మాణం జరగాలి. దీని కూడా ప్రస్తుత కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్‌రెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలోనే చకచకా పనులు సాగాయి. కానీ పొలాల మధ్యలో బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని కొందరు రైతులు కోరడంతో అక్కడక్కడ పనులు కాలువ పనులు పెండింగ్‌లో నిలిచిపోయాయి. పెండింగ్‌ పనులు కూడా పూర్తి చేసేందుకు 2013లో మరో రూ.1.99 కోట్లు మంజూరు చేశారు. ఇలా పనులు జరుగుతుండగానే అనాటి ప్రభుత్వ కాలం ముగిసింది. రాష్ట్ర విభజన, నిధుల కొరత తదితర కారణాల వల్ల పనలు నిలిచిపోయాయి. ఆ తర్వాత 2104లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

టీడీపీ పాలనలో నత్తనడక పనులు..
సప్లయ్‌ ఛానల్‌ పెండింగ్‌ పనులు పూర్తి చేసి మోపాడు చెరువకు నీరు వచ్చేలా చేస్తామని టీడీపీ ప్రభుత్వం, నాయకులు రైతులకు యామ మాటలు చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సప్లయ్‌ ఛానల్‌ పనులు ఒక్కటి కూడా మొదలుపెట్టలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఆ పనులు ఊసే ప్రస్థావనకు తీసుకురాలేదు. వీఆర్‌కోట వద్ద ఉన్న ఆనకట్ట కేవలం పూనాదికి గుంట తీసేరే తప్పా పనులు ప్రారంభించలేదు. కాలువపై నిర్మించాల్సిన బ్రిడ్జిలు సుమారు ఆరు ఉన్నాయి. ఆనకట్ట వద్ద పనులు, కాలువ పనులు పూర్తి కాకపోవడంతో పనులు ఎక్కడ పెండింగ్‌ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఐదేళ్లుగా కాలువ గురించి పట్టించుకోకపోవడంతో కాలువ కూడా పూడిపోతుంది. కాలువు నిర్మాణం చేసిన తర్వాత ఒక్క సారి కూడా నీరు పారుదల కాకపోవడం, వర్షాలు లేకపోవడంతో కాలువకు ఇరువైపు ఉన్న మట్టి అంతా జారీ కాలువలో పడి అక్కడక్కడ పూడిపోతుంది. చిల్ల చెట్లు పెరిగి కాలువ మూసుకుపోయింది.

రైతులకు ఏ మాత్రం ఉపయోగపడలేదు..
ఈ టీడీపీ ఐదేళ్ల పాలనతో రైతులకు ఉపయోగపడే పనులు చేసింది ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మోపాడు చెరువుకు ఏర్పాటు చేసిన సప్లయ్‌ ఛానల్‌ పనులను అసలు పట్టించుకోలేదు. కేవలం నీరు చెట్టు కింద రెండు సార్లు లక్షల రూపాయిలు మంజూరు చేయించుకొని పూడిక తీసినట్లు మమ అనిపించారు. ఉపాధి హామీ కూలీలు చేసిన గుంటలను ప్రొక్లెయిన్‌తో చెక్కి ఇదే నీరు చెట్టుకింద చూపించారని రైతులు చెప్తున్నారు. అదే నిధులు వీఆర్‌కోట–మోపాడు సప్లయ్‌ ఛానల్‌కు ఉపయోగిస్తే పనులు పూర్తయి ఉండేవని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇదేటో గాని వర్షాలు పడవని చంద్రబాబుకు తెలుసులాగుంది. అందుకేనోమో కాలువ పనులు గాని, చెరువు అభివృద్ధి పనులు గాని ఏమి చేయలేదు. వర్షాలు కూడా పడ లేదు. దీంతో ఆయకట్టంతా బీళ్లుగానే మిగిలిపోయాయి. రైతుల కళ్లలో కన్నీళ్లు మిగిలాయి.

1
1/1

కాలువ పూడిపోయి పెరిగిన చిల్ల చెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement