వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు | TDP followers join YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు

Jul 15 2017 4:31 PM | Updated on Aug 10 2018 9:42 PM

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

కర్నూలు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరారు.  మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ, వామపక్షాలకు చెందిన దాదాపు 500 మంది వైసీపీలో చేరారు. అంతకుమునుపు రూ.40 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు హెబ్బటం చెరువును వారు పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement