స్వామి చల్లగా చూస్తారు: సీజే | Swami cool looking: cj | Sakshi
Sakshi News home page

స్వామి చల్లగా చూస్తారు: సీజే

Sep 7 2014 12:40 AM | Updated on Sep 2 2017 12:58 PM

స్వామి చల్లగా చూస్తారు: సీజే

స్వామి చల్లగా చూస్తారు: సీజే

దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానని, స్వామి కూడా చల్లగా చూస్తారని,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం లోధా అన్నారు.

తిరుమల : దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానని, స్వామి కూడా చల్లగా చూస్తారని,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం లోధా అన్నారు. ఆయన శనివారం సాయంత్రం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు మహద్వారం వద్దకు చేరుకున్న లోధా దంపతులకు టీటీడీ ఈవో గిరిధర్‌గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, అర్చకులు  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. లోధా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు.  

అప్పన్న సన్నిధిలో హైకోర్టు సీజే

 సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం రాష్ర్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయ దర్శించుకున్నారు. ఈవో రామచంద్రమోహన్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
 

Advertisement
 
Advertisement
Advertisement