పొట్టకూటి కోసం వెళ్లి అనంత లోకాలకు.. | Suspicious death of man in Karnataka | Sakshi
Sakshi News home page

పొట్టకూటి కోసం వెళ్లి అనంత లోకాలకు..

Mar 4 2016 4:27 PM | Updated on Sep 3 2017 7:00 PM

పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి రాని లోకాలకు తరలిపోయాడు. విశాఖ జిల్లా సీలేరు ప్రాంతానికి చెందిన గొల్లూరి శివో బొగ్గు ఫ్యాక్టరీలో పని చేయడానికి కర్ణాటక వెళ్లాడు.

సీలేరు (విశాఖ జిల్లా) : పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి రాని లోకాలకు తరలిపోయాడు. విశాఖ జిల్లా సీలేరు ప్రాంతానికి చెందిన గొల్లూరి శివో బొగ్గు ఫ్యాక్టరీలో పని చేయడానికి కర్ణాటక వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న శివో బుధవారం వాంతులు, విరేచనాలతో అకస్మాతుగా మృతిచెందాడు. కనీసం కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వని ఫ్యాక్టరీ యాజమాన్యం గురువారం అర్థరాత్రి అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామం సీలేరుకు తరలించింది.

శివో మృతిపై అతని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలోనే ఏదో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బొగ్గు ఫ్యాక్టరీ యాజమాన్యం వచ్చి సమాధానం చెబితే కానీ అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని దించేది లేదని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement