యువకుని అనుమానాస్పద మృతి | suspicious death of a young man | Sakshi
Sakshi News home page

యువకుని అనుమానాస్పద మృతి

Jun 8 2017 11:42 PM | Updated on Sep 5 2017 1:07 PM

ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పెదన్నపాలెం పొలాల్లో ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ కె.అజయ్‌కుమార్‌ కథనం ప్రకారం..

దొనకొండ : ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పెదన్నపాలెం పొలాల్లో ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ కె.అజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. బాదాపురానికి చెందిన దండా సుబ్బారెడ్డి (38) రోజూ సైకిల్‌పై ఐస్‌లు అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఆయన నాలుగు రోజుల నుంచి ఇంటికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో పెదన్నపాలెం పొలాల్లో దుర్వాసన రావడంతో పశుపోషకులు అక్కడ మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. వీఆర్‌ఓ మాబూవలి ఫిర్యాదు మేరకు దర్శి డీఎస్పీ వీఎస్‌ రాంబాబు, సీఐ ఎం.శ్రీనివాసరావులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం దండా సుబ్బారెడ్డిదిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement