సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలి | Supreme Court judge inquiry | Sakshi
Sakshi News home page

సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలి

Jun 13 2015 2:43 AM | Updated on Jul 28 2018 3:23 PM

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి, చంద్రబాబు పాత్రను నిగ్గుతేల్చడానికి...

ఎస్సీ వర్గీకరణ తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబుదే
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లయ్య మాదిగ
 
 కళ్యాణదుర్గం : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి, సీం చంద్రబాబు పాత్రను నిగ్గుతేల్చడానికి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీవర్గీకరణ చేపట్టాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. శుక్రవారం కళ్యాణదుర్గంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గుద్దిళ్ల నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధి జగ్గుల ప్రకాష్, తాలూకా అధ్యక్షుడు చెలిమప్పతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

అవినీతి ఆరోపణలపైబాబు తన సచ్ఛీలతను నిరూపించుకోవాలన్నారు. పదవి నుంచి తప్పుకొని విచారణకు ముందుకు రావాలన్నారు. ఎస్సీవర్గీకరణ చేపట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేపట్టి పెద్దమాదిగ అవుతానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఎన్నికల్లో మాదిగల ఓట్లను దండుకొని గద్దెనెక్కిన బాబు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. జీఓ-25పేరుతో బాబు మరోసారి మోసం చేస్తున్నారన్నారు.

ఆగస్టులో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా తీర్మానించాలన్నారు.   భవిష్యత్ కార్యాచణ కోసం మందక్రి ష్ణ మాదిగ ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గోవిందు, నాగరాజు, రాజేష్, శ్రీనివాసులు, వీరన్న, ఈశ్వరయ్య, చిన్నా, నాగభూషణ, మారెన్న పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement