గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయంలో రేపటి నుంచి (మే 25) సుదర్శన మహాయాగం జరగనుంది.
అమరావతి (గుంటూరు) : గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయంలో రేపటి నుంచి (మే 25) సుదర్శన మహాయాగం జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీనివాసానంద సరస్వతి స్వామి తెలిపారు. శనివారం దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... పంచాయతన సహిత సుదర్శన యాగంలో పాల్గొనాలని అనుకునేవారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కాగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడుతున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.శ్రీనివాసరెడ్డి చెప్పారు.