అనంతపురం జిల్లా గోరంట్ల మండలం శెట్టిచిన్నంపల్లెలో ఓ టీడీపీ నాయకుడి ఇంటి నుంచి పెద్ద మొత్తంలో సబ్సిడీ విత్తనాలను వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం: అనంతపురం జిల్లా గోరంట్ల మండలం శెట్టిచిన్నంపల్లెలో ఓ టీడీపీ నాయకుడి ఇంటి నుంచి పెద్ద మొత్తంలో సబ్సిడీ విత్తనాలను వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నాయుకుడు, వ్యాపారి కూడా అయిన శివారెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 411 బస్తాల (ఒక్కోటీ 30 కిలోలు) సబ్సిడీ వెరుశనగ విత్తనాలు వెలుగు చూశాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.