లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్‌రిజిస్ట్రార్ | Subregister caught by ACB receiving Bribery in westgodavari district | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్‌రిజిస్ట్రార్

Mar 9 2016 3:11 PM | Updated on Aug 17 2018 12:56 PM

చింతలపూడి సబ్ రిజిస్ట్రార్ రేపల్లె వెంకట బాల గోపాలకృష్ణ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.

పశ్చిమగోదావరి జిల్లా: చింతలపూడి సబ్ రిజిస్ట్రార్ రేపల్లె వెంకట బాల గోపాలకృష్ణ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. చింతలపూడి మండలం వెలగలపల్లి గ్రామానికి చెందిన శరత్ రెడ్డి అనే రైతు నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్ పట్టుబడ్డాడు. తనకున్న 70 సెంట్ల భూములను రిజిస్టర్ చేయించుకునేందుకు శరత్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా..సబ్‌రిజిస్ట్రార్ రిజిస్టర్ చేసేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సబ్రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement