దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న పోరాటాన్ని ఉధృతృం చేశారు.
సబ్ కలెక్టరేట్ ముట్టడికి యత్నం
భారీగా పోలీసుల మొహరింపు
సీఐటీయూ నేతల అరెస్టు
విజయవాడ : దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న పోరాటాన్ని ఉధృతృం చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా శుక్రవారం వందలాదిమంది అంగన్‌వాడీ సిబ్బంది సబ్ కలెక్టర్ కార్యాలయాృ్న ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు సీఐటీయూ, అంగన్‌వాడీ సిబ్బందిని అరెస్టుచేసి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు యు.ఉమామహేశ్వరరావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే మార్చి 17న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్దఎత్తున అన్ని సంఘాలతో తరలివచ్చి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ అంగన్‌వాడీ సిబ్బంది ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సీపీఎం నగర కార్యదర్శి సిహెచ్.బాబూరావు, కాంగ్రెస్ నాయకుడు నరహరశెట్టి నరసింహారావు, సీఐటీయూ ముజఫర్ అహ్మద్, ఆర్.రోజా, జె.రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.