మహబూబ్నగర్ జిల్లా ఇమిస్తాపూర్లో స్కూల్ ఫీజు కోసం అని ఓ విద్యార్థిని ప్రాణం తీశారు.
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా ఇమిస్తాపూర్లో స్కూల్ ఫీజు కోసం అని ఓ విద్యార్థిని ప్రాణం తీశారు. పంచవటి స్కూల్లో చదువుకునే ఓ విద్యార్థిని స్కూల్ ఫీజు చెల్లించలేదు. దాంతో ఆ పాపను స్కూల్ యాజమాన్యం ఎండలో నిలబెట్టింది. గంటసేపు ఎండలోనిలబడిన తరువాత ఆ విద్యార్థినికి మూర్చ వచ్చి పడిపోయింది. పడిపోయిన పిల్ల అక్కడే ప్రాణాలు వదిలింది.
ఫీజు కోసం పిల్ల ప్రాణం తీశారని తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నారు. యాజమాన్యం వైఖరి వల్లే తమ బిడ్డ చనిపోయిందని వారు ఆందోళనకు దిగారు. ఫీజు కోసం యాజమాన్యం కర్కశంగా వ్యవహరించిందని వారు బోరున ఏడుస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.