సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి | Stone pelting on Seemandhra Employees Bus in Khamma District | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి

Sep 6 2013 9:33 PM | Updated on Sep 1 2017 10:30 PM

'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు వస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసినట్టు ఖమ్మం జిల్లా పెనుమల్లి పీఎస్‌లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.

 
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు వస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసినట్టు ఖమ్మం జిల్లా పెనుమల్లి పీఎస్‌లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలం మండలపాడు వద్ద జరిగింది. రాళ్లదాడిలో చింతలపూడి ఈవోకు స్వల్పగాయాలైనట్టు తెలిసింది. ఈ ఘటనపై పెనుమల్లి పీఎస్‌లో సీమాంధ్ర ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. 
 
ఇదిలాఉండగా, నల్గొండ జిల్లాలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.  హైదరాబాద్లో శనివారం జరిగేసభకు తెలంగాణవాదులు అడ్డుతగలకుండా చర్యలు తీసుకున్నారు.  జాతీయరహదారులపై 10-15 కి.మి చొప్పున చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని డీఐజీ నవీన్‌చంద్ తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement