రాష్ట్ర విభజనతో ఎన్నికలకు సంబంధం లేదు: భన్వర్లాల్ | State bifurcation is not associated with elections, says Bhanwar Lal | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజనతో ఎన్నికలకు సంబంధం లేదు: భన్వర్లాల్

Feb 22 2014 6:16 PM | Updated on Aug 14 2018 4:32 PM

రాష్ట్ర విభజనతో ఎన్నికలకు సంబంధం లేదు: భన్వర్లాల్ - Sakshi

రాష్ట్ర విభజనతో ఎన్నికలకు సంబంధం లేదు: భన్వర్లాల్

ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ పేర్కొన్నారు.

హైదరాబాద్: ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో ఎన్నికలకు సంబంధం లేదని భన్వర్‌లాల్‌ తేల్చి చెప్పారు. ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామా అనే విషయాన్ని ఎన్నికల కమిషన్ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

ఈ నెల 25లోపు ఎన్నికల బదిలీలు పూర్తి చేయమని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు చెప్పారు. ఓటర్ లీస్టులో పేరుందో లేదో ప్రతి ఒక్కరూ ముందుగా చెక్ చేసుకోవాలని భన్వర్లాల్ సూచించారు. కాగా, 9246 2800 27 అనే నంబర్‌కు VOTE స్పెస్‌ ఇచ్చి EPIC కార్డు నంబర్ ఎంటర్ చేసి ఎస్‌ఎమ్ఎస్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చనని భన్వర్‌లాల్‌ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement