రేపు శ్రీశైలం ఆలయం మూసివేత | srisailam temple to be closed on april 4th due to lunar eclipse | Sakshi
Sakshi News home page

రేపు శ్రీశైలం ఆలయం మూసివేత

Apr 3 2015 7:00 PM | Updated on Sep 2 2017 11:48 PM

చంద్రగ్రహణం సందర్భంగా శనివారం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఆలయం మూసివేయనున్నారు.

శ్రీశైలం : చంద్రగ్రహణం సందర్భంగా శనివారం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఆలయం మూసివేయనున్నారు. శనివారం వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి మంగళవాయిద్యాలు, సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు, మహా మంగళహారతులు నిర్వహించిన అనంతరం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

ఉదయం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని,  రాత్రి 8 గంటల తర్వాత ఆలయ ద్వారాలు తెరిచి దేవాలయశుద్ధి, సంప్రోక్షణ చేసి స్వామి అమ్మవార్లకు పూజలు, మహానివేదన తదితర కార్యక్రమాలు చేపడతామని అధికారులు వెల్లడించారు. తిరిగి ఆదివారం ఉదయం దర్శన, ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement