నేడు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు | srilankan president rajapakse to visit tirumala | Sakshi
Sakshi News home page

నేడు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు

Dec 9 2014 8:16 AM | Updated on Sep 2 2017 5:54 PM

నేడు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు

నేడు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు

శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే మంగళవారం తిరుమల వస్తున్నారు.

శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే మంగళవారం తిరుమల వస్తున్నారు. రాత్రి తిరుమలలో బస చేసి, బుధవారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. గతంలో కూడా ఆయన తిరుమల వచ్చి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

కాగా, శ్రీలంక అధ్యక్షుడు వస్తుండటంతో తిరుమలలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సిమి ఉగ్రవాదులు పలుచోట్ల దాడులకు పాల్పడే ప్రమాదం ఉందన్న ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఈసారి భద్రతా ఏర్పాట్లు గతం కంటే కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement