అందుబాటులోకి శ్రీవారి మహా ప్రసాదం | Sreevari mahaprasadham available to devotees from today | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి శ్రీవారి మహా ప్రసాదం

May 15 2020 1:51 PM | Updated on May 15 2020 1:59 PM

Sreevari mahaprasadham available to devotees from today - Sakshi

సాక్షి, తిరుపతి : నేటి నుంచి భక్తులకు శ్రీవారి మహా ప్రసాదం అందుబాటులో రానుంది. తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలనా భవనం వద్ద శ్రీవారి కళ్యాణోత్సవ లడ్డూలను విక్రయానికి ఉంచారు. శ్రీవారికి నైవేద్యంగా పెట్టిన పెద్ద లడ్డూలతో పాటు శ్రీవారి వడ ప్రసాదాన్ని సైతం విక్రయానికి ఉంచనున్నారు. ఎలాంటి షరతులు లేకుండా కోరినన్ని లడ్డూ, వడలు ఇవ్వనున్నారు. 50 రోజుల తర్వాత లడ్డూ ప్రసాదం అందుబాటులోకి రావడం పట్ల భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement