breaking news
sree venkateshwara swamy
-
స్వర్ణగిరికి బ్రహ్మోత్సవాల సిరి : అంగరంగ వైభవంగా ప్రారంభం
అపార కారుణ్యమూర్తి, భక్తవత్సలుడు, సర్వగుణ సంపన్నుడు, భూలోక వైకుంఠ క్షేత్ర నాథుడు అయిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మ్సావ, సంవత్సరోత్సవ సేవలలో అత్యంత ప్రధానమైనది బ్రహ్మోత్సవం.వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణా నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. లోక కల్యాణార్థం సకల శుభ్రప్రాప్తి కోసం అస్మద్ ఆచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో అంగరంగ వైభవంగా... అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల వివరాలు..విశేష కార్యక్రమాలు అంకురార్పణతో ఆరంభంస్వర్ణగిరీశుని ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాడు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభ మయ్యాయి. 17వ తేది వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వాహకులు మానేపల్లి రామారావు తెలిపారు.విశేష కార్యక్రమం వివరాలు నేటినుంచి పల్లకిసేవ... 12 వ తేది: సింహవాహన సేవ, పరమేష్టివాహనం, నిశాచూర్ణోత్సవం, సాయంత్రం: ఎదుర్కోళ్ల ఉత్సవం, స్వామి వారికి గజవాహన సేవ, అమ్మవారికి హంసవాహన సేవ(లోక కల్యాణం కోసం)13 వ తేది: పల్లకీ సేవ, సుదర్శన ఇష్టిహవనం, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, గరుడవాహన సేవ, అశ్వవాహనసేవ, 14 వ తేది: పల్లకీసేవ, సకల కార్యసిద్ధి కొరకు విష్వక్సేన ఇష్టి, సాయంత్రం హనుమంతవాహన సేవ. 15 వ తేది: పల్లకి సేవ, సకల విద్యాప్రాప్తి కొరకు హయగ్రీవ ఇష్టి.సాయంత్రం అశ్వవాహన సేవ. 16 వ తేది: పల్లకి సేవ, ధన్వంతరి ఇష్టి, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. 17 వ తేది: సర్వభూపాల వాహన సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, చక్రస్నానం. సాయంత్రం పల్లకి సేవ, పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, బలిహరణ మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, మహా కుంభ సంప్రోక్షణ, శాత్తు మొఖై, వేద విన్నపములు, రుత్విక్వరణం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్టితో పూర్తికానున్నాయి. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సుప్రభాత సేవ, ప్రాతఃకాల ఆరాధన, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చనలు, వేదవిన్నపం, విశేష హోమాలు, పంచసూక్త పరివార,ప్రాయశ్చిత్త హోమాలు, నివేదనలు, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠిసాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకుశ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలలో ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, విశేష హోమాలు, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హోమాలు, నివేదన, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి– యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
శ్రీవారిని దర్శించుకున్న 6278 మంది భక్తులు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని బుధవారం 6278 మంది భక్తులు దర్శించుకున్నారు. నేడు శ్రీవారి హుండీ ఆదాయం 52 లక్షలు వచ్చింది. 2248 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.(రాజమౌళి, ఆయన కుటుంబసభ్యులకు కరోనా) తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో బుధవారం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఉదయం శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్ వరణం నిర్వహించారు. శ్రీవారి మూలవిరాట్ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ, తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు దోషం కలగకుండా.. ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజున పవిత్రాల ప్రతిష్ట, రెండవ రోజు పవిత్రల సమర్పణ, ఆఖరి రోజున పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే ఈ మూడురోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. -
అందుబాటులోకి శ్రీవారి మహా ప్రసాదం
సాక్షి, తిరుపతి : నేటి నుంచి భక్తులకు శ్రీవారి మహా ప్రసాదం అందుబాటులో రానుంది. తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలనా భవనం వద్ద శ్రీవారి కళ్యాణోత్సవ లడ్డూలను విక్రయానికి ఉంచారు. శ్రీవారికి నైవేద్యంగా పెట్టిన పెద్ద లడ్డూలతో పాటు శ్రీవారి వడ ప్రసాదాన్ని సైతం విక్రయానికి ఉంచనున్నారు. ఎలాంటి షరతులు లేకుండా కోరినన్ని లడ్డూ, వడలు ఇవ్వనున్నారు. 50 రోజుల తర్వాత లడ్డూ ప్రసాదం అందుబాటులోకి రావడం పట్ల భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) 81,609 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 1.83 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.


