ఇంట్లో తండ్రి మృతదేహం.. 'పరీక్ష' | Son Losses Father And Attend Exam in Vizianagaram | Sakshi
Sakshi News home page

ఎంత కష్టం!

Mar 6 2020 1:13 PM | Updated on Mar 6 2020 1:13 PM

Son Losses Father And Attend Exam in Vizianagaram - Sakshi

పరీక్షకు హాజరైన పతివాడ రాంబాబు

విజయనగరం, గరివిడి: ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగా... పుట్టెడు దుఖంతో పరీక్షకు హాజరయ్యాడు కుమారుడు. కన్నీటిని దిగమింగుకొని పరీక్షను రాశాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దుమ్మెద గ్రామానికి చెందిన పతివాడ రాంబాబు చీపురుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి పతివాడ సత్యం(55) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రి మృతి చెందడంతో రాంబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరీక్షకు హాజరు కావాలా! వద్దా! అనే మీమాంసలో చివరకు తన దుఖాన్ని గుండెల్లో దాచుకొని పరీక్షకు హాజరయ్యాడు. తనను ఎంతో కష్టపడి చదివించిన తండ్రి ఆశయం నెరవేర్చాలని, జన్మనిచ్చిన తండ్రి ఇకరారని తెలుసుకుని ఆయన ఆశయానికి విలువనిచ్చి పరీక్ష రాసేందుకు చీపురుపల్లిలోని జీవీఆర్‌ కళాశాలకు వెళ్లాడు. ఈ ఘటన గ్రామస్తులను కన్నీరు పెట్టించాయి. సత్యం మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement