
సాక్షి, గుంటూరు: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభ వేళ.. భక్తులను ఉద్దేశిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు. నేడు విజయనగరంలో నిర్వహించే సిరుల తల్లి సిరిమానోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా అని అన్నారాయన.
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు. నేడు విజయనగరంలో నిర్వహించే సిరుల తల్లి సిరిమానోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. pic.twitter.com/tEKuDLMhMm
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2025
సిరిమానోత్సవం సందర్భంగా.. అమ్మవారు సిరిమాను అనే చెట్టు కొమ్మపై కూర్చొని భక్తులకు దర్శనమిస్తుంది. మహారాజ కోట నుంచి ప్రారంభమై, ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలతో ఊరేగింపు ఉంటుంది. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల కష్టాలు తొలగిపోతాయని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం.