కుమారుడు తాగి చెడిపోతుంటే.. తాగొద్దురా అని మందలించినందుకు తల్లిని అంతం చేశాడు ఓ తాగుబోతు.
పార్వతీపురం (విజయనగరం) : కుమారుడు తాగి చెడిపోతుంటే.. తాగొద్దురా అని మందలించినందుకు తల్లిని అంతం చేశాడు ఓ తాగుబోతు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బైక్ మెకానిక్‌గా పనిచేసే ఓలేటి త్రినాథ్ శుక్రవారం బాగా మద్యం సేవించి ఇంటికి రావడంతో ఆ విషయమై తల్లి కృష్ణమ్మతో వాగ్వివాదం నడిచింది. మద్యం మత్తులో ఆవేశానికి లోనైన త్రినాథ్.. తాగొద్దంటావా అంటూ రాడ్ తీసుకుని తల్లి తలపై బలంగా కొట్టాడు.
గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా... కృష్ణమ్మను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.