‘ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం’ | solve problems of public priority | Sakshi
Sakshi News home page

‘ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం’

Nov 6 2015 1:25 AM | Updated on Sep 3 2017 12:04 PM

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నట్లు ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. 37వ వార్డు పరిధి బింగివీధి, డక్కిన వీధి ప్రాంతాల్లో నూతనంగా

విజయనగరం మున్సిపాలిటీ: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నట్లు ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. 37వ వార్డు పరిధి బింగివీధి, డక్కిన వీధి ప్రాంతాల్లో  నూతనంగా ఏర్పాటు చేసిన  రెండు బోరుబావులను ఎమ్మెల్యే  గీతతో పాటు మున్సిపల్ ఛైర్మన్ ప్రసాదుల రామకృష్ణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డులో రెండు బోరుబావులు చొప్పున మొత్తం  80 బోరుబావులు ఏర్పాటు చేసేందుకు రూ.50లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కందిమురళీనాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement