ప్రియా గార్డెన్స్‌లో నాగజెర్రి కలకలం | snake halchal | Sakshi
Sakshi News home page

ప్రియా గార్డెన్స్‌లో నాగజెర్రి కలకలం

Apr 24 2018 1:15 PM | Updated on Aug 20 2018 7:28 PM

snake halchal - Sakshi

పాముని పట్టుకున్న కరి సీతారామాచార్యులు

సింహాచలం(పెందుర్తి): తొమ్మిది అడుగుల నాగజెర్రి సోమవారం రాత్రి సింహాచల దేవస్థానం ఇన్‌చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు ఇంట్లో కలకలం సృష్టించింది. రాత్రి 8 గంటల సమయంలో నాగజెర్రి స్థానిక ప్రియాగార్డెన్స్‌లో నివసిస్తున్న అర్చకుని ఇంట్లో మేడ మెట్ల కిందకి వెళ్లడాన్ని పులువురు స్థానికులు చూశారు.

విషయాన్ని గోపాలకష్ణమాచార్యులకు తెలియజేశారు. దేవస్థానంలోనే పనిచేస్తున్న అలంకారి కరి సీతారామాచార్యులు(ఈయన స్నేక్‌ క్యాచర్‌)కు ఫోన్‌లో సమాచారం అందించారు. ఆయన వచ్చి చాకచక్యంగా పాముని పట్టుకుని సమీప తోటల్లో విడిచిపెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement